బ్లాక్ ప‌సుపు విక్ర‌యం.. ఏడుగురు అరెస్టు

0
95

బ్లాక్ ప‌సుపు విక్ర‌యం.. ఏడుగురు అరెస్టు

ఖ‌మ్మం : మెడిసిన్ త‌యారీలో ఉపయోగించే నిషేధిత అట‌వీ ఉత్ప‌త్తి బ్లాక్ ప‌సుపును విక్ర‌యిస్తున్న ముఠా స‌భ్యుల‌ను పోలీసులు ప‌ట్టుకున్నారు. ఈ ఘ‌ట‌న ఖ‌మ్మంలో చోటుచేసుకుంది. బ్లాక్ ప‌సుపు క్ర‌య విక్ర‌యాలు జ‌రుగుతున్న‌ట్లుగా విశ్వ‌స‌నీయ స‌మాచారం మేర‌కు టాస్క్‌ఫోర్స్ పోలీసులు స్థానిక విష్ణు హోట‌ల్‌పై రైడ్ చేశారు. ఈ సంద‌ర్భంగా చేప‌ట్టిన త‌నిఖీల్లో బ్లాక్ పసుపు విక్రయాలు జరుగుతున్నట్లు గుర్తించారు. పినపాక మండలం రేగుపల్లికి చెందిన విక్ర‌య‌దారుడు దుర్గాం సురేష్‌తో పాటు కోనుగోలుదారులు ఏడుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

నిందితుల‌ను గుడిపల్లి జగదీష్( లెనిన్ నగర్, ఖమ్మం), తిగాబోయినా వెంకటేష్(కారేపల్లి మండలం చీమల పాడు), కామపతి ప్రతాప్( ప్రకాష్ నగర్, ఖమ్మం), గుడిపల్లి వెంకట్రామణ(సహకారనగర్), శనిగరం మహేష్(కె.సముద్రం, మహాబూబాబాద్), బత్తుల గురువయ్య(కూసుమంచి), కీర్తి మహేష్(హన్మకొండ) గా గుర్తించారు. వీరి వ‌ద్ద నుంచి 2 కిలోల ప‌సుపు మూలాలు, రూ. 2,15,600 న‌గ‌దు, ఏడు సెల్‌ఫోన్ల స్వాధీనం చేసుకున్నారు.

పాఠకులకు ముఖ్య గమనిక : పబ్లిక్ మీడియా న్యూస్ ఛానెల్ నందు న్యూస్ రిపోర్టర్ గా చేయడానికి మండలాల వారిగా న్యూస్ రిపోర్టర్లు…

Posted by PM News on Monday, August 10, 2020
Like & Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here