సీజనల్ వ్యాధుల నివారణకు,ఉచితంగా హోమియో మందుల పంపిణీ…

0
159

—రామగుండం పోలీస్ కమిషనరేట్—

             //మంచిర్యాల జిల్లా//

🔹 సీజనల్ వ్యాధుల నివారణకు,ఉచితంగా హోమియో మందుల పంపిణీ…

👉 సాయి వైకుంఠ ట్రస్ట్ డా.రవి కిరణ్ గారి చేయుతతో యాదవ సంఘం మంచిర్యాల జిల్లా అధ్యక్షులు కొమ్ము అశోక్ గారి ఆధ్వర్యంలో భీమిని పోలీస్ స్టేషన్ లో ఈ రోజు హోమియో మాత్రలు ఎస్సై ఏ.కొమురయ్య గారి చేతుల మీదుగా సుమారు 500ల కుటుంబాలకు మరియు భీమిని, కన్నెపల్లి మీడియా మిత్రులకు ఉచితంగా హోమియో మందులు పంపిణీ చెయ్యడం జరిగింది.

✍️ ఈ సందర్భంగా భీమిని ఎస్సై కొమురయ్య గారు మాట్లాడుతూ…సీజనల్ వ్యాధులు అనగా డెంగ్యూ, మలేరియా వంటి జ్వరాలు రాకుండా ఇమ్యూనిటీ పవర్ పెంపొందుటకు ప్రతి ఒక్కరు ఈ మాత్రలు వేసుకోవాలని,ప్రస్తుతం వర్షాకాలం కబ్బాటి వివిధ సీజనల్ వ్యాధులు సోకడం వంటివి జరుగుతాయి కబ్బాటి ప్రతి ఒక్కరు మీ ఆరోగ్యం పట్ల తగు జాగ్రత్తలు తీసుకోవాలి అని ఎస్సై గారు సూచించారు.

👉 ఈ కార్యక్రమంలో యాదవ సంఘం మంచిర్యాల జిల్లా అధ్యక్షులు కొమ్ము అశోక్,భీమిని,కన్నెపల్లి మండలాల యాదవ సంఘం అధ్యక్షులు పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Like & Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here