Sunday, January 17, 2021
Home State KERALA కేరళ || కోజికోడ్ విమాన ప్రమాదం || ప్రమాదానికి గల కారణాలు || PUBLICMEDIA

కేరళ || కోజికోడ్ విమాన ప్రమాదం || ప్రమాదానికి గల కారణాలు || PUBLICMEDIA

విమానాలు టేకాఫ్ అయ్యేటప్పుడు చాలా ఈజీగా అవుతాయి. కానీ… రన్‌వేపై ల్యాండ్ అయ్యేటప్పుడే ప్రమాదాలు ఎక్కువగా జరుగుతుంటాయి.

కేరళ… కోజికోడ్‌ విమాన ప్రమాదం మరోసారి ఈ విషయాన్ని స్పష్టం చేస్తోంది. శుక్రవారం రాత్రి 7:40 గంటలకు 191 మంది ప్రయాణికులతో… ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానం… కోజికోడ్ ఎయిర్‌పోర్టులో రన్‌వేపై ల్యాండ్ అవుతూ… పక్కకు జారిపోయింది. ఇందుకు కారణం… కేరళలో జోరు వర్షాలు పడుతుంటే… రన్‌వే తడిగా ఉంది. అందువల్లే టైర్లు జారి… విమానం పక్కకు వెళ్లి… కుదుపులకు లోనై… 50 అడుగుల లోయలోకి జారి… రెండు ముక్కలైంది. ఆ సమయంలో భారీ శబ్దం వచ్చింది. విమానం పేలిపోయిందేమో అనుకున్నారు. లక్కీగా మంటలేవీ రాకపోవడంతో… పెను ప్రమాదం తప్పినట్లైంది. అయినప్పటికీ… ఈ ప్రమాదంలో పైలట్, కోపైలట్ సహా… 20 మంది ప్రాణాలు కోల్పోయారు.


బోయింగ్‌ 737 ఐఎక్స్‌ 1344, ఎక్స్‌ప్రెస్‌ విమానం… ‘వందే భారత్‌’లో భాగంగా విదేశాల్లో ఉన్న భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చింది. దుబాయ్‌ నుంచి పది మంది చిన్నారులు సహా 184 మంది ప్రయాణికులు, ఇద్దరు పైలెట్లు, ఏడుగురు సిబ్బందితో కొజికోడ్‌ బయలుదేరింది. ప్రమాదానికి ముందు… రెండుసార్లు ల్యాండింగ్ కోసం ప్రయత్నించి… ఆకాశంలోనే రౌండ్లు వేసింది.
మూడోసారి ల్యాండ్ అవుతూ… ప్రమాదంలో చిక్కుకుంది. కాస్త ఎక్కువ వేగంతో ల్యాండ్ అవ్వడం వల్లే విమానం కంట్రోల్ తప్పిందనే వాదన వినిపిస్తోంది. రాత్రంతా సహాయ చర్యలు జరిగాయి. తీవ్రంగా గాయపడిన 15 మందినీ, స్వల్పంగా గాయపడిన 123 మందిని కోజికోడ్ మెడికల్ కాలేజీ ఆస్పత్రికి తరలించారు.

విమాన ప్రమాదంపై రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్‌ షా దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ట్విటర్‌ ద్వారా మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరారు. విమాన ప్రమాదం తననెంతో కలచివేసిందని మోదీ ట్వీట్‌ చేశారు. కేరళ సీఎం పినరయి విజయన్‌కు మోదీ ఫోన్‌ చేసి ప్రమాద వివరాల్ని తెలుసుకున్నారు.


బాధిత కుటుంబాలకు సమాచారం అందించేందుకుగాను షార్జా, దుబాయ్‌లలో భారత రాయబార కార్యాలయ సిబ్బంది సహాయక కేంద్రాల్ని ఏర్పాటు చేశారు. ప్రమాద ఘటనపై విచారణకు పౌర విమానయాన శాఖ మంత్రి హర్దీప్‌ సింగ్‌ పూరి ఆదేశాలు జారీ చేశారు. భారత్‌లో చివరిసారిగా పదేళ్ల కిందట ఇలాగే విమాన ప్రమాదం జరిగింది. 2010లో కర్ణాటకలోని మంగళూరు ఎయిర్‌పోర్టులో రన్‌వేపై ఎయిర్‌ ఇండియా విమానం జారింది. ఆ ప్రమాదంలో విమానంలో ఉన్న 158 మందీ చనిపోయారు.

Contact DetailsMr.Showkath Ali Basha (Chairman)+91 82470 25470Mr.RaviTeja (Director)+91 63098 76494

Posted by PM News on Wednesday, August 5, 2020
Like & Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

సీజనల్ వ్యాధుల నివారణకు,ఉచితంగా హోమియో మందుల పంపిణీ…

సాయి వైకుంఠ ట్రస్ట్ డా.రవి కిరణ్ గారి చేయుతతో యాదవ సంఘం మంచిర్యాల జిల్లా అధ్యక్షులు కొమ్ము అశోక్ గారి ఆధ్వర్యంలో భీమిని పోలీస్ స్టేషన్ లో ఈ రోజు హోమియో మాత్రలు ఎస్సై ఏ.కొమురయ్య గారి చేతుల మీదుగా సుమారు 500ల కుటుంబాలకు మరియు భీమిని, కన్నెపల్లి మీడియా మిత్రులకు ఉచితంగా హోమియో మందులు....

ఐఐటి విద్యార్థినికి మంత్రి కేటీఆర్ చేయూత

వరంగల్ జిల్లా హసన్పర్తి కి చెందిన మేకల అంజలికి మంత్రి కే తారకరామారావు ఈరోజు ఆర్థిక సాయం అందించారు. మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో ఐఐటి లో మొదటి సంవత్సరం పూర్తి చేసుకొని రెండవ సంవత్సరంలోకి ప్రవేశించిన అంజలి ఫీజులు ఇతర ఖర్చులు లాప్టాప్ ఖరీదు నిమిత్తం లక్ష 50 వేల రూపాయలను అందించారు. గత ఏడాది హసన్పర్తి లోని గురుకులంలో...

హైదరాబాద్‌లో అందుబాటులోకి మరో పైవంతెన..

హైదరాబాద్‌లో అందుబాటులోకి మరో పైవంతెన.. ప్రారంభించిన మంత్రి కేటీఆర్‌ మహానగరంలో ట్రాఫిక్‌ కష్టాలు తీర్చేందుకు మరో పైవంతెన అందుబాటులోకి వచ్చింది. బైరామల్‌గూడ చౌరస్తా వద్ద పైవంతెనను రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌.....

బ్లాక్ ప‌సుపు విక్ర‌యం.. ఏడుగురు అరెస్టు

ఖ‌మ్మం : మెడిసిన్ త‌యారీలో ఉపయోగించే నిషేధిత అట‌వీ ఉత్ప‌త్తి బ్లాక్ ప‌సుపును విక్ర‌యిస్తున్న ముఠా స‌భ్యుల‌ను పోలీసులు ప‌ట్టుకున్నారు. ఈ ఘ‌ట‌న ఖ‌మ్మంలో చోటుచేసుకుంది. బ్లాక్ ప‌సుపు క్ర‌య విక్ర‌యాలు జ‌రుగుతున్న‌ట్లుగా విశ్వ‌స‌నీయ.....
Like & Share