Sunday, January 17, 2021
Home Politics టీడీపీ మాజీ ఎమ్మెల్యేపై మరో మూడు కేసులు..

టీడీపీ మాజీ ఎమ్మెల్యేపై మరో మూడు కేసులు..

టీడీపీ మాజీ ఎమ్మెల్యేపై మరో మూడు కేసులు..

  • జైలు నుంచి విడుదలైన 24 గంటల్లోపే..
  • సీఐతో జేసీ ప్రభాకర్ రెడ్డి వాగ్వాదం

కడప : నిన్న కడప జైలు నుంచి విడుదలైన టీడీపీ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డిపై మరో మూడు కేసులు నమోదయ్యాయి.

కడప జైలు నుంచి జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన కుమారుడు అస్మిత్ రెడ్డి.. అక్కడ నుంచి భారీ కారు ర్యాలీతో బయలుదేరారు.

అయితే ఈ ర్యాలీ కారణంగా ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. ఈ సమయంలో అక్కడే విధులు నిర్వహిస్తున్న పోలీస్ ఆఫీసర్ తాడిపత్రి సీఐ దేవేందర్ పట్ల జేసీ దివాకర్ రెడ్డి దురుసుగా వ్యవహరించారు.

ఈ ర్యాలీ హెవీ వాహానాలకు మాత్రమే అనుమతి ఉన్న లైన్‌లో ప్రవేశించడానికి ప్రయత్నించడంతో అక్కడే ఉన్న సీఐ దేవేందర్ ఆ కాన్వాయ్‌ను అడ్డుకునేందుకు యత్నించారు.

దీంతో కాన్వాయ్ దిగిన జేసీ ప్రభాకర్ రెడ్డి.. సీఐ దేవేందర్‌తో దురుసగా వ్యవహరించారు. నా కారును ఎందుకు ఆపుతున్నారంటూ ప్రశ్నించారు.

ఈ సమయంలో జేసీ ప్రభాకర్ రెడ్డి అనుచరులు సైతం కొద్దిసేపు హంగామా సృష్టించారు.

ఈ సంఘటనపై విచారణ చేసిన తరువాత అనంతపురం పోలీసులు జేసీపై మూడు సెక్షన్ల కితం కేసులు నమోదు చేశారు.

ఐపీసీ 353 తోపాటు ఎస్సీ,ఎస్టీ అట్రాసీటి కేసులు కూడా జేసీ ప్రభాకర్ రెడ్డిపై నమోదు చేశారు పోలీసులు. జైలు నుంచి విడుదలైన 24 గంటలు తిరగక ముందే జేసీ ప్రభాకర్ రెడ్డిపై మరో మూడు కేసులు నమోదు కావడం చర్చనీయాంశంగా మారింది.

ఇక ఇప్పటికే జేసీ దివాకర్ రెడ్డి, ఆయన తనయుడు అస్మిత్ రెడ్డి 54 రోజుల పాటు జైలు జీవితం గడిపారు.

Like & Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

సీజనల్ వ్యాధుల నివారణకు,ఉచితంగా హోమియో మందుల పంపిణీ…

సాయి వైకుంఠ ట్రస్ట్ డా.రవి కిరణ్ గారి చేయుతతో యాదవ సంఘం మంచిర్యాల జిల్లా అధ్యక్షులు కొమ్ము అశోక్ గారి ఆధ్వర్యంలో భీమిని పోలీస్ స్టేషన్ లో ఈ రోజు హోమియో మాత్రలు ఎస్సై ఏ.కొమురయ్య గారి చేతుల మీదుగా సుమారు 500ల కుటుంబాలకు మరియు భీమిని, కన్నెపల్లి మీడియా మిత్రులకు ఉచితంగా హోమియో మందులు....

ఐఐటి విద్యార్థినికి మంత్రి కేటీఆర్ చేయూత

వరంగల్ జిల్లా హసన్పర్తి కి చెందిన మేకల అంజలికి మంత్రి కే తారకరామారావు ఈరోజు ఆర్థిక సాయం అందించారు. మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో ఐఐటి లో మొదటి సంవత్సరం పూర్తి చేసుకొని రెండవ సంవత్సరంలోకి ప్రవేశించిన అంజలి ఫీజులు ఇతర ఖర్చులు లాప్టాప్ ఖరీదు నిమిత్తం లక్ష 50 వేల రూపాయలను అందించారు. గత ఏడాది హసన్పర్తి లోని గురుకులంలో...

హైదరాబాద్‌లో అందుబాటులోకి మరో పైవంతెన..

హైదరాబాద్‌లో అందుబాటులోకి మరో పైవంతెన.. ప్రారంభించిన మంత్రి కేటీఆర్‌ మహానగరంలో ట్రాఫిక్‌ కష్టాలు తీర్చేందుకు మరో పైవంతెన అందుబాటులోకి వచ్చింది. బైరామల్‌గూడ చౌరస్తా వద్ద పైవంతెనను రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌.....

బ్లాక్ ప‌సుపు విక్ర‌యం.. ఏడుగురు అరెస్టు

ఖ‌మ్మం : మెడిసిన్ త‌యారీలో ఉపయోగించే నిషేధిత అట‌వీ ఉత్ప‌త్తి బ్లాక్ ప‌సుపును విక్ర‌యిస్తున్న ముఠా స‌భ్యుల‌ను పోలీసులు ప‌ట్టుకున్నారు. ఈ ఘ‌ట‌న ఖ‌మ్మంలో చోటుచేసుకుంది. బ్లాక్ ప‌సుపు క్ర‌య విక్ర‌యాలు జ‌రుగుతున్న‌ట్లుగా విశ్వ‌స‌నీయ.....
Like & Share