పండుగ పూట విషాదం.. అన్నాచెల్లెళ్లు
మృతి…పెద్దన్నకు రాఖీ కట్టి
తిరిగొస్తుండగారాఖీ పండుగ రోజు వనపర్తి జిల్లాలో
విషాదం చోటు చేసుకుంది. రోడ్డు
ప్రమాదం రూపంలో మృత్యువు
అన్నాచెల్లెళ్లను కబళించింది. పండుగ
పూట సంతోషంగా గడపాల్సిన
అన్నాచెల్లెళ్లు మృత్యువాత పడటంతో ఆ
కుటుంబంలో విషాదం నెలకొంది
వివరాల్లోకి వెళ్తే.. వనపర్తి జిల్లా
చిన్నంబావి మండలం లక్ష్మీపల్లి గ్రామానికి
చెందిన అన్నాచెల్లెళ్లు తూంకుంట
దామోకర్,నందిని,లక్ష్మీ సోమవారం
బైక్ పై పెద్దదగడ గ్రామానికి వెళ్లారు
అక్కడ పెద్ద సోదరుడికి రాఖీ కట్టి తిరిగి
వస్తుండగా వీరి బైక్ ను కొల్లాపూర్ డిపోకి
చెందిన ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. దీంతో
దామోదర్,నందిని తీవ్రంగా గాయపడి
అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు
తీవ్రంగా గాయపడ్డ లక్ష్మిని పోలీసులు
ఆస్పత్రిలో చేర్చారు. ఈ ఘటనపై కేసు
నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు
పోలీసులు వెల్లడించారు. ప్రమాదం
గురించి తెలిసి కుటుంబ సభ్యులు బోరున
విలపించినట్లు సమాచారం.