విచిత్ర సంఘటన
తుర్కపల్లి తాండ నారాయణఖేడ్ మండల్ సంగారెడ్డి జిల్లా.
రూము లోపలికి వెళ్లి మనుషులకే గడియ పెట్టుకో రాని పరిస్థితుల్లో ఒక శునకం రూము లోకి వెళ్లి గడియ పెట్టుకున్న సంఘటన తుర్కపల్లి తాండ గ్రామపంచాయతీ లో చోటుచేసుకుంది.
సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండల్ తుర్కపల్లి తండాలో నిర్మిస్తున్న వైకుంఠధామం లో 2 రోజుల క్రితం ఒక శునకం వైకుంఠ ధామం లోని డ్రెస్సింగ్ రూమ్ లోకి వెళ్లి లోపటి నుండి గడియ పెట్టుకోవడంతో అందులోనే బందీగా మిగిలిపోయింది. ఈరోజు వైకుంఠధామం నిర్మిస్తున్న కాంట్రాక్టర్ రాములు నాయక్ అక్కడికి వెళ్లి ఇంకా కొంచెం కలర్ మిగిలి ఉండగా వేయిస్తా మనీ రూము తలుపులు తీసే ప్రయత్నం చేయగా లోపలి నుంచి గడియ వేసి ఉంది. అందులో ఎవరైనా మనుషులు ఉన్నారా అని వెనుక వైపు కిటికీలోనుంచి చూడగా ఒక శునకం అందులో కనబడింది. మనుషులు మాత్రం లేరు శునక మే కొండి వేసుకొని అందులో ఎలా ఉంది. అని ఆశ్చర్యానికి గురై తుర్కపల్లి తాండ సర్పంచ్‌కు తెలుపగా అక్కడికి వచ్చిన సర్పంచ్ కుమారులు నెహ్రూ నాయక్ రవి నాయక్ కొంత మంది గ్రామస్తులు వచ్చి చూడగా కొండి పెట్టుకొని ఉన్న దృశ్యాన్ని చూసి అవాక్కయ్యారు. ఇది ఎలా సాధ్యం అయింది. అని గమనించి వెనక వైపు నుండి కట్టెతో కొండిని తీసి కుక్కనీ బయటకి పంపించారు. ఇదేదో వింతగా ఉందని తండా వాసులు ఆశ్చర్యానికి గురయ్యారు.