చిత్తూరు జిల్లా మదనపల్లె మండలం అంకిశెట్టిపల్లి పంచాయతీ రామాపురం గ్రామానికి చెందిన ఓ 13ఏళ్ళ బాలుడు సెల్ ఫోన్ చోరీచేశాడని అభియోగంతో గతనెల 30వతేదీన ఏడుగురు హత్య చేసిన సంఘటన పాఠకులకు విధితమే. మంగళవారం మదనపల్లె రూరల్ సీఐ శ్రీనివాసులు, ఎస్ఐ దిలీప్ కుమార్ హత్యా నిందితులను అరెస్టు చేశారు. వివరాలు.. మదనపల్లె మండలం రామాపురం గ్రామంకు చెందిన చాంద్ బాష ఇంటిలో చంద్రశేఖర్ కు భార్య, కుమారుడు భరత్, ఇద్దరు కుమార్తెలు అద్దెకు ఉంటున్నారు.
జులై 30న ఇంటిఓనర్ చాంద్ బాష తన సెల్లును భరత్ అనే బాలుడు చోరీ చేశాడని పెదనాన్న శివయ్య, కుమారుడు అశోక్ కుమార్లు సెల్ ఫోన్ విషయమై మందలించగా చోరీ చేసినట్లు బాలుడు ఒప్పుకున్నాడు. అయితే ఆ సెల్ ఫోన్ ఇంటి ఓనర్ చాంద్ బాషకు అమ్మినట్లు బాలుడు తండ్రి చెప్పాడు. అశోక్, రాజేష్, రవిలు బాలుడిని వెంటబెట్టుకుని ఇంటిఓనర్ చాంద్ బాషను అడిగారు. ఆగ్రహించిన చాంద్ బాష, ఇంటి అద్దెకు ఉంటున్న మోహన్ లు బాలుడిని చితకబాదారు. అంతటితో ఆడకుండా ఆ బాలుడిని రాత్రి వేరొకచోటకు తీసుకెళ్ళి సెల్ ఫోన్ విషయమై నిలదీస్తూ తీవ్రంగా చితకబాదారు. సెల్ ఆచూకి తాను చెప్పిస్తానని గ్రామవాలంటీర్ వెంకటప్రవీణ్ అపస్మారక స్థితిలో పడివున్న బాలుడికి అగ్గిపుల్ల గీసి బెదిరిస్తు కొట్టారు. ఆరోజు రాత్రి బాలుడిని ఇంటివద్ద వదిలేసి వెళ్ళిపోయారు.
31తేదీన ఉదయం బాలుడు భరత్ చనిపోయాడు. దీంతో తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసునమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టి బాలుడు చావుకు కారణమైన శివయ్య(57), అతని కుమారుడు అశోక్ (27), ఇంటిఓనర్ చాంద్ బాష(55), వాలంటీర్ వెంకటప్రవీణ్(32) అద్దెకు ఉంటున్న మోహన్ కృష్ణ (35), అశోక్ బంధువు రాజేష్(25), స్నేహితుడు రవిరాజా(21)లను మంగళవారం సందిరెడ్డిపల్లి వద్ద అరెస్టు చేసినట్లు సీఐ, ఎస్ఐలు వెల్లడించారు.