జగన్ సర్కార్ బంపర్ ఆఫర్..
_ నకిలీ మందులపై సమాచారమిస్తే రివార్డు!
నకిలీ మందులు విక్రయిస్తూ కేటుగాళ్లు ప్రజల ఆరోగ్యంతో ఆడుకుంటున్నారు.
ఈ నేపథ్యంలో అలాంటి కేటుగాళ్లు ఆగడాలకు చెక్ పెట్టేందుకు ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
నకిలీ ఔషదాల దందా పై కొరడా జులిపించాలని సీఎం జగన్ ఆదేశించారు.
తాజాగా ముఖ్యమంత్రి ఔషధ నియంత్రణపై క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు.
సమావేశంలో డ్రగ్ కంట్రోల్లో విజిలెన్స్ అండ్ ఇంటెలిజెన్స్ విభాగాన్ని ఏర్పటు చేయాలని నిర్ణయించారు.
డ్రగ్ తయారీ యూనిట్లలో నాణ్యతపై దృష్టి సారించడమే కాకుండా భారీ జరిమానాలు విధించేలా కఠినమైన నిబంధనలను అమలులోకి తీసుకురావాలని ఆదేశించారు.
ప్రభుత్వాస్పత్రుల్లో ఎప్పటికప్పుడు తనిఖీలు జరగాలని ఆదేశించారు. నకిలీ మందుల విక్రయాలపై ఎలా సమాచారం అందించాలనే సమాచారం మెడికల్ షాపుల వద్ద ఏర్పాటు చేయాలన్నారు.
నకిలీ మందులపై సమాచారం అందించిన వారికి రివార్డులు ఇవ్వాలని సూచించారు.