అనుమానంతో భార్యను హతమార్చిన భర్త ..
గొంతు కోసుకుని ఆత్మహత్యాయత్నం చేసుకున్న భర్త..
భార్య రేణుక మృతి.. భర్త ప్రభాకరరెడ్డి పరిస్థితి విషమం ..

చిత్తూరు జిల్లా వి కోట మండలం పాముగానిపల్లిలో అనుమానం పెనుభూతమై పచ్చని కాపురంలో చిచ్చు రగిలింది. తాగుడుకు బానిసైన భర్త ప్రభాకరరెడ్డి (32) భార్య రేణుక (22)పై అనుమానం పెంచుకుని సోమవారం ఉదయం భార్యభర్తలిద్దరూ గొడవ పడ్డారు. పాముగానిపల్లె సమీపంలోని పొలం వద్ద ఇరువురు ఘర్షణ పడి కోపంతో వెంట తెచ్చుకున్న మచ్చుకత్తితో భార్య మెడపై నరికి అమానుషంగా ఆమెను అంతమొందించారు. అనంతరం అతను తనువు చాలించాలని గొంతు కోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. వీరికి నాలుగు సంవత్సరాల కుమారుడు రెండు సంవత్సరాల కుమార్తె అన్నారు. ఘటనను గమనించిన పరిసరాల వారు పోలీసులకు సమాచారం అందించారు. కొన ఊపిరితో చికిత్స నిమిత్తం వికోట ఆసుపత్రికి తరలించే పనుల్లో ఎస్సై మహేష్ బాబు నిమగ్నమయ్యారు. పోలీసులు హత్య జరిగిన వైనంపై ఆరా తీస్తున్నారు. ఈ మేరకు వికోట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు .