Friday, August 7, 2020
Home District విశాఖలో చిన్నపిల్లల అక్రమ వ్యాపారం ఆశ వర్కర్ల చేత అక్రమ రవాణా...గుట్టు రట్టు

విశాఖలో చిన్నపిల్లల అక్రమ వ్యాపారం ఆశ వర్కర్ల చేత అక్రమ రవాణా…గుట్టు రట్టు

విశాఖలో చిన్నారులను అక్రమ రవాణా చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేసారు. యూనివర్సల్ సృష్టి హాస్పిటల్ ఎండీ నర్మత ఆధ్వర్యంలో చిన్నపిల్లల అమ్మకాలు జరుగుతున్నట్టు గుర్తించారు. పిల్లలను పోషించే స్థితిలో లేని తల్లి దండ్రులను టార్గెట్ చేసి అమ్మకాలు చేస్తున్నట్టు తేలింది. తల్లి తండ్రులకు ముందుగానే అడ్వాన్స్ ఇచ్చి పుట్టిన తరవాత పిల్లలను తరలిస్తున్నట్టు గుర్తించారు.

పిల్లలను అక్రమరవాణా చేస్తున్న ఆరుగురిని అరెస్ట్ చేసారు. ఇద్దరు ఆశావర్కర్లు వెంకటలక్ష్మి, అన్నపూర్ణ, డాక్టర్‌ తిరుమల ఈ ముఠాకు సహకరిస్తునట్టు గుర్తించారు…

ఈ ఘటనపై విశాఖపట్నం పోలీస్‌ కమిషనర్‌ ఆర్కే మీనా మీడియాతో మాట్లాడుతూ..పిల్లల అక్రమ రవాణా కేసులో యూనివర్సల్ సృష్టి హాస్పిటల్ ఎండి నర్మత సహా ఆరుగుర్ని అరెస్ట్ చేశామన్నారు.

–విశాఖలోని జడ్పీ జంక్షన్ వద్ద గల యూనివర్సల్ సృష్టి హాస్పిటల్ కేంద్రంగా పిల్లల అక్రమ విక్రయాలు జరుగుతున్నాయని తెలిపారు. ముఠా ఇప్పటివరకు ఆరుగురు చిన్నారులను కొనుగోలు చేసి అక్రమ రవాణా చేసినట్టు వెల్లడించారు.

Like & Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

చిత్తూరు జిల్లాలో భారీ నకిలీ మద్యం పట్టివేత || PUBLICMEDIA

చిత్తూరు జిల్లాలో భారీ నకిలీ మద్యం పట్టివేత https://youtu.be/_hFTWRiEdvE కర్ణాటక నుంచి ఆంధ్రా...

టీడీపీ మాజీ ఎమ్మెల్యేపై మరో మూడు కేసులు..

టీడీపీ మాజీ ఎమ్మెల్యేపై మరో మూడు కేసులు.. జైలు నుంచి విడుదలైన 24 గంటల్లోపే..సీఐతో జేసీ ప్రభాకర్ రెడ్డి వాగ్వాదం కడప...

అనుముల మండలం హజారి గూడెంలో అన్నదమ్ముల దారుణ హత్య.

నల్లగొండ : జిల్లాలో రాఖీ పండుగ రోజున విషాదం. అనుముల మండలం హజారి గూడెంలో అన్నదమ్ముల దారుణ హత్య. అన్నదమ్ములు జానపాటి...

పండుగ పూట విషాదం.. అన్నాచెల్లెళ్లు మృతి…

పెద్దన్నకు రాఖీ కట్టి తిరిగొస్తుండగారాఖీ పండుగ రోజు వనపర్తి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు అన్నాచెల్లెళ్లను కబళించింది. పండుగ పూట సంతోషంగా గడపాల్సిన అన్నాచెల్లెళ్లు మృత్యువాత
Like & Share