Thursday, January 28, 2021
Home State సాఫ్ట్ వేర్ శారదా'కథనంపై స్పందించిన సోనూసూద్.

సాఫ్ట్ వేర్ శారదా’కథనంపై స్పందించిన సోనూసూద్.

సాఫ్ట్ వేర్ శారదా’కథనంపై స్పందించిన సోనూసూద్

హైదరాబాద్‌: ఇబ్బందుల్లో ఉన్నవారికి ఆపన్న హస్తం అందించి రియల్‌ హీరో అనిపించుకుంటున్న నటుడు సోనూసూద్‌ మరోసారి పెద్ద మనసు చాటుకున్నారు. సాఫ్ట్‌వేర్‌ శారదకు సాయం చేసేందుకు ముందుకొచ్చారు. సాక్షి టీవీ కథనానికి స్పందించిన సోనూసూద్ సాఫ్ట్‌వేర్ ఆమె ఫోన్ నంబర్ అడిగి తెలుసుకున్నారు.

శారదకు వ్యక్తిగతంగా సాయం చేస్తానని హామీనిచ్చారు. కాగా, కరోనా లాక్‌డౌన్‌ కారణంగా ఉద్యోగం కోల్పోయిన యువ సాఫ్ట్‌వేర్‌ శారద తల్లిదండ్రులకు సాయంగా కూరగాయల వ్యాపారం చేస్తున్న సంగతి తెలిసిందే.

జీవితంలో ఆటుపోట్లు సహజమని, ఉద్యోగం కోల్పోయినంత మాత్రాన దిగులుపడొద్దని శారద యువతకు సందేశమిచ్చారు. బతికేందుకు ఎన్నో మార్గాలు ఉన్నాయని, సమస్యలకు ఎదురొడ్డి పోరాడాలని చెప్పారు. ఇక శారద స్ఫూర్తిదాయకమైన కథనంపై వరంగల్‌ ఎంపీ పసునూరి దయాకర్‌, తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, వైఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగం, ఉపరాష్ట్రపతి కార్యాలయం, తెలంగాణ బీజేపీ నాయకులు స్పందించారు. ప్రభుత్వ పరంగా శారద కుంటుంబాన్ని ఆదుకుంటామని వరంగల్‌ ఎంపీ దయాకర్‌, మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఇప్పటికే వెల్లడించారు. ఇదిలాఉండగా.. కటిక దారిద్ర్యంలో ఉన్న చిత్తూరు జిల్లా మదనపల్లెకు చెందిన ఓ రైతును ఆదుకునేందుకు కూడా తాజాగా సోనూసూద్‌ ముందుకొచ్చారు. ఎద్దులు లేక ఇబ్బంది పడుతున్న రైతుకు ఏకంగా ట్రాక్టర్‌నే ఇస్తానని మాటిచ్చారు.ఇచ్చిన మాట ప్రకారం నెరవేర్చడంతో ఆ కుటుంబం సంతోషం లో మునిగిపోయింది..

Like & Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

సీజనల్ వ్యాధుల నివారణకు,ఉచితంగా హోమియో మందుల పంపిణీ…

సాయి వైకుంఠ ట్రస్ట్ డా.రవి కిరణ్ గారి చేయుతతో యాదవ సంఘం మంచిర్యాల జిల్లా అధ్యక్షులు కొమ్ము అశోక్ గారి ఆధ్వర్యంలో భీమిని పోలీస్ స్టేషన్ లో ఈ రోజు హోమియో మాత్రలు ఎస్సై ఏ.కొమురయ్య గారి చేతుల మీదుగా సుమారు 500ల కుటుంబాలకు మరియు భీమిని, కన్నెపల్లి మీడియా మిత్రులకు ఉచితంగా హోమియో మందులు....

ఐఐటి విద్యార్థినికి మంత్రి కేటీఆర్ చేయూత

వరంగల్ జిల్లా హసన్పర్తి కి చెందిన మేకల అంజలికి మంత్రి కే తారకరామారావు ఈరోజు ఆర్థిక సాయం అందించారు. మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో ఐఐటి లో మొదటి సంవత్సరం పూర్తి చేసుకొని రెండవ సంవత్సరంలోకి ప్రవేశించిన అంజలి ఫీజులు ఇతర ఖర్చులు లాప్టాప్ ఖరీదు నిమిత్తం లక్ష 50 వేల రూపాయలను అందించారు. గత ఏడాది హసన్పర్తి లోని గురుకులంలో...

హైదరాబాద్‌లో అందుబాటులోకి మరో పైవంతెన..

హైదరాబాద్‌లో అందుబాటులోకి మరో పైవంతెన.. ప్రారంభించిన మంత్రి కేటీఆర్‌ మహానగరంలో ట్రాఫిక్‌ కష్టాలు తీర్చేందుకు మరో పైవంతెన అందుబాటులోకి వచ్చింది. బైరామల్‌గూడ చౌరస్తా వద్ద పైవంతెనను రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌.....

బ్లాక్ ప‌సుపు విక్ర‌యం.. ఏడుగురు అరెస్టు

ఖ‌మ్మం : మెడిసిన్ త‌యారీలో ఉపయోగించే నిషేధిత అట‌వీ ఉత్ప‌త్తి బ్లాక్ ప‌సుపును విక్ర‌యిస్తున్న ముఠా స‌భ్యుల‌ను పోలీసులు ప‌ట్టుకున్నారు. ఈ ఘ‌ట‌న ఖ‌మ్మంలో చోటుచేసుకుంది. బ్లాక్ ప‌సుపు క్ర‌య విక్ర‌యాలు జ‌రుగుతున్న‌ట్లుగా విశ్వ‌స‌నీయ.....
Like & Share