Thursday, June 10, 2021
Home District నాలుగేళ్ల చిన్నారిని కడతేర్చిన తల్లి || భర్త ఒత్తిడితో ఘాతుకానికి పాల్పడ్డ వైనం. 

నాలుగేళ్ల చిన్నారిని కడతేర్చిన తల్లి || భర్త ఒత్తిడితో ఘాతుకానికి పాల్పడ్డ వైనం. 

భోగాపురం(విజయనగరం):

భార్యాభర్తల మధ్య గొడవతో కన్నతల్లే కూతురును బావిలో పడేసి కడతేర్చిన ఘటన విజయనగరం జిల్లా డెంకాడ మండలం డి.తాళ్లవలస గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. తొమ్మిదేళ్ల క్రితం తాళ్లవలస గ్రామానికి చెందిన బంక శ్రీను, పూసపాటిరేగ మండలం వెంపడం గ్రామానికి మహాలక్ష్మితో వివాహం అయింది. వీరికి ఇద్దరు కూతుర్లు. దంపతుల మధ్య తరచూ గొడవలు జరగడంతో శ్రీను తన భార్యను నాలుగేళ్ల క్రితం పుట్టింటికి పంపించాడు. తరువాత ఒకటి రెండు సార్లు మాత్రమే భార్యను పుట్టింటి వద్ద కలిశాడు. పెద్ద కూతురు, శ్రీను తాళ్లవలసలో ఉంటున్నారు. తరువాత మహాలక్ష్మి పుట్టింటి వద్ద గర్భం దాల్చి చిన్నకూతురు రమ్య(4)కు జన్మనిచ్చింది. అప్పటి నుంచి శ్రీను భార్యను అనుమానించడంతో గొడవలు మరింత ఎక్కువయ్యాయి. దీంతో భార్య పుట్టింటి వద్దే ఉంటూ వచ్చింది. ఇటీవల పదిరోజుల క్రితం పెద్దల సమక్షంలో జరిగిన ఒప్పందం మహాలక్ష్మి చిన్నకూతురు రమ్యను తీసుకొని తాళ్లవలసలోని భర్త వద్దకు వచ్చింది. వచ్చినప్పటి నుంచి చిన్నకూతురును వదిలించుకోవాలంటూ శ్రీను ఆమెపై ఒత్తిడి తెచ్చాడు.


దీంతో మహాలక్ష్మి తీవ్ర మనస్తాపం చెంది ఆదివారం తెల్లవారుజామున సుమారు 2గంటల సమయంలో రమ్యను తీసుకొని సమీపంలో ఉన్న తమ పొలంలోని బావి వద్దకు చేరకుంది. కూతురితో పాటు తాను బావిలో దూకాలని నిశ్చయించుకుంది. మొదట పాపను బావిలో పడేసింది. తరువాత కొంత సేపు పాప ఆర్తనాదాలు విని భయపడి తన ఆత్మహత్య నిర్ణయాన్ని విరమించుకుంది. తెల్లవారుజామున చిన్నారి రమ్య కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు వెతకడం ప్రారంభించారు. ఆదివారం ఉదయం సుమారు 7గంటల సమయంలో సమీపంలోని బావిలో ఉన్న మృతదేహాన్ని గుర్తించారు. శ్రీను తండ్రి నారాయణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని బావిలో ఉన్న మృతదేహాన్ని బయటకు తీశారు. పోలీసుల విచారణలో మహాలక్ష్మి భర్త ఒత్తిడితో కూతురును తానే హతమార్చినట్లు ఒప్పుకుంది. శ్రీను, మహాలక్ష్మిలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Like & Share

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

సీజనల్ వ్యాధుల నివారణకు,ఉచితంగా హోమియో మందుల పంపిణీ…

సాయి వైకుంఠ ట్రస్ట్ డా.రవి కిరణ్ గారి చేయుతతో యాదవ సంఘం మంచిర్యాల జిల్లా అధ్యక్షులు కొమ్ము అశోక్ గారి ఆధ్వర్యంలో భీమిని పోలీస్ స్టేషన్ లో ఈ రోజు హోమియో మాత్రలు ఎస్సై ఏ.కొమురయ్య గారి చేతుల మీదుగా సుమారు 500ల కుటుంబాలకు మరియు భీమిని, కన్నెపల్లి మీడియా మిత్రులకు ఉచితంగా హోమియో మందులు....

ఐఐటి విద్యార్థినికి మంత్రి కేటీఆర్ చేయూత

వరంగల్ జిల్లా హసన్పర్తి కి చెందిన మేకల అంజలికి మంత్రి కే తారకరామారావు ఈరోజు ఆర్థిక సాయం అందించారు. మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో ఐఐటి లో మొదటి సంవత్సరం పూర్తి చేసుకొని రెండవ సంవత్సరంలోకి ప్రవేశించిన అంజలి ఫీజులు ఇతర ఖర్చులు లాప్టాప్ ఖరీదు నిమిత్తం లక్ష 50 వేల రూపాయలను అందించారు. గత ఏడాది హసన్పర్తి లోని గురుకులంలో...

హైదరాబాద్‌లో అందుబాటులోకి మరో పైవంతెన..

హైదరాబాద్‌లో అందుబాటులోకి మరో పైవంతెన.. ప్రారంభించిన మంత్రి కేటీఆర్‌ మహానగరంలో ట్రాఫిక్‌ కష్టాలు తీర్చేందుకు మరో పైవంతెన అందుబాటులోకి వచ్చింది. బైరామల్‌గూడ చౌరస్తా వద్ద పైవంతెనను రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌.....

బ్లాక్ ప‌సుపు విక్ర‌యం.. ఏడుగురు అరెస్టు

ఖ‌మ్మం : మెడిసిన్ త‌యారీలో ఉపయోగించే నిషేధిత అట‌వీ ఉత్ప‌త్తి బ్లాక్ ప‌సుపును విక్ర‌యిస్తున్న ముఠా స‌భ్యుల‌ను పోలీసులు ప‌ట్టుకున్నారు. ఈ ఘ‌ట‌న ఖ‌మ్మంలో చోటుచేసుకుంది. బ్లాక్ ప‌సుపు క్ర‌య విక్ర‌యాలు జ‌రుగుతున్న‌ట్లుగా విశ్వ‌స‌నీయ.....
Like & Share