నాయుడుపేట లో కరోన బాధితుల రోదన అరణ్య రోధనే

0
142

నాయుడుపేట లో రోజు రోజుకూ కరోనా కేసులు పెరుగుతుండడం వారి కుటుంబ సభ్యులకు కుడా పాజిటివ్లు రావడం తో పరిస్థితి చెయ్యిజారిపోయే పరిస్థితి నెలకొంది. ఏకంగా ఒకేరోజు 42 కేసులు రావడంతో అధికారులలో ఆందోళన మొదలైంది.

నాయుడుపేట కు సమీపంలో ఉన్న అరబిందో ఫార్మా కేంద్రంగా కరోనా విజృంభిస్తుండడంతో పట్టణ ప్రజలు బయ బ్రాంతులకు గురిచేస్తోంది. ఇదిలా ఉంటె అధికారుల సమన్వయ లోపం కొట్టొచ్చినట్లు కనబడుతోంది. కంటోన్మెంట్ ఏరియాలలో రోడ్డులను మూసి వేసే బాధ్యత ఆర్ అండ్ బి వారిధిఆయితే బిల్లులు రాలేదని చేతులు దులుపుకొన్నారు. మొన్నటి వరకు హుషారుగా ఉన్న వైద్య ఆరోగ్య శాఖ ఈ రోజు నత్తనడకన టెస్ట్ లు చేస్తుండడంతో ప్రైమరీ సేంకండ్రి కేసులు పెరుకుపోతున్నాయి. పరిస్థితి ఎలావుందీ అంటే అన్ని రకాలుగా సింటమ్స్ ఉన్న వారిని కూడా టెస్ట్ ల కోరకు తుప్పుకుంటు నరకం చూపిస్తున్నరూ. వీరికి పోసిటివ్ లక్షణాలు ఉండంతో చుట్టుపక్కల వారు బయన్దోళనలు గురవుతున్న కొత్తగా బాద్యతలు తీసుకున్న వైద్య శాఖ అధికారులు పట్టించుకోక పోవడం వారి నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. ఓపక్క పోలీసు లు నిరంతరం కృషి చేస్తూ వ్యాధి ప్రబలకుండా అనేక చర్యలు చేపడుతున్నా వైరస్ సోకిన వారి తరలింపుకుడా జాప్యం చేస్తుండడం తో పరిస్థితి చెయ్యిజరిపోయే స్థితికి వచ్చింది.

గత మూడు రోజులుగా పట్టణం లోని నారాయణ స్కూల్ పక్కన అరబిందో ఉద్యోగికి పాజిటివ్ రాగా అతని భార్య తీవ్ర అనారోగ్యంతో బాధపడుతోంది. శ్వాస తీసుకోవడం చాలా ఇబ్బంది గా ఉందని తనకు పరీక్ష చేసి కాపాడమని వేసుకుంటున్నా వైద్య శాఖలో పట్టించుకున్న నాధుడే కరువయ్యాడు. ఇలాంటివి చాలా ఉన్నాయని బాధితులు తెలియజేస్తున్నారు. ఇకనైనా అధికారులు మేలుకొని అవసరమైన వారికి ముందుగా పరీక్షలు నిర్వహించి వ్యాధి అదుపుకు కృషిచేయాలని ప్రజలు కోరుకుంటున్నారు

Like & Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here