Tuesday, January 19, 2021
Home International దేశంలో పెరిగిన పాజిటివ్ కేసుల రేటు.. కారణం ఇదేనట!

దేశంలో పెరిగిన పాజిటివ్ కేసుల రేటు.. కారణం ఇదేనట!

ఢిల్లీ : గత పదిహేను రోజుల నుంచి కరోనా వైరస్ కేసులు పెరుగుతున్నాయి.

రెండు వారాల కిందట 10.6 శాతంగా ఉన్న పాజిటివ్ కేసుల రేటు ప్రస్తుతం 13 శాతానికి చేరిందని గణాంకాలు వెల్లడిస్తున్నాయి

దేశంలో కరోనా వైరస్ ఉద్ధృతి కొనసాగుతోంది. గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 49,310 మందికి కొత్తగా వైరస్ నిర్ధారణ అయ్యింది.

గత 15 రోజుల్లో పాజిటవ్ కేసుల రేటు 10.66 నుంచి 13 శాతానికి చేరిందని అధికార వర్గాలు తెలిపాయి.

టెస్టింగ్ సామర్ధ్యం పెరగడంతోనే పాజిటివ్ కేసుల రేటు పెరిగిందని పేర్కొన్నారు.

దేశంలో పాజిటివ్ కేసులు పెద్ద సంఖ్యలో నమోదుకు టెస్టింగ్ సామర్థ్యం పెరగడమే కారణమని, రాబోయే రోజుల్లో వైరస్ పీఠభూమి దశకు చేరుకుంటుందని ప్రభుత్వ అధికారులు అన్నారు.

కానీ, మహారాష్ట్ర, తమిళనాడు వంటి రాష్ట్రాల్లో వైరస్ వేగంగా వ్యాపిస్తోందని, దీనికి నియంత్రణ చర్యలు వైఫల్యమే కారణమని వ్యాఖ్యానించారు.

వివిధ ప్రదేశాలలో మహమ్మారి వివిధ దశల్లో ఉందని, ఇది వ్యాప్తి ధోరణికి అద్దం పడుతోందన్నారు.

ప్రస్తుతం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, పశ్చిమ్ బెంగాల్, అసోం, బిహార్, ఒడిశాలోని ప్రధాన నగరాల నుంచి చుట్టుపక్కల జిల్లాలకు వైరస్ వ్యాపించింది.

కోల్‌కతా, ఢిల్లీ, ముంబై, చెన్నైతో సహా చాలా మెట్రో నగరాలలో కేసులు స్థిరంగా ఉన్నప్పటికీ మరిన్ని రక్షణ చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది.

దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతున్నప్పటికీ.. మహమ్మారి కోరల్లోంచి బయటపడుతున్నవారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది.

దేశంలో వరుసగా మూడో రోజూ కరోనాను జయించిన వారి సంఖ్య 24 గంటల్లో మరో రికార్డును నమోదు చేసింది.

గురువారం ఒక్కరోజే 34,602 మంది రోగులు కోలుకోవడంతో దేశంలో రికవరీ రేటు 63.45శాతానికి పెరిగినట్టు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.

కరోనా పరీక్షలను పెంచి పాజిటివిటీ రేటు తగ్గిస్తామని ప్రకటించిన కేంద్రం అందుకనుగుణంగా టెస్టుల సంఖ్యను పెంచుతోంది.

దేశవ్యాప్తంగా 1290 ల్యాబ్‌లలో కరోనా నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు. గురువారం ఒక్క రోజే 3,52,801 శాంపిల్స్‌ పరీక్షించారు.

దేశంలో నిన్నటి వరకు 1,54,28,170 శాంపిల్స్‌ను పరీక్షలు చేశారు.

దేశంలో మొత్తం ల్యాబ్‌లలో 897 ప్రభుత్వ లేబొరేటరీలు కాగా.. 393 ప్రైవేటు సెక్టార్‌ ల్యాబ్‌ల్లో కరోనా పరీక్షలు జరుగుతున్నాయి.

Like & Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

సీజనల్ వ్యాధుల నివారణకు,ఉచితంగా హోమియో మందుల పంపిణీ…

సాయి వైకుంఠ ట్రస్ట్ డా.రవి కిరణ్ గారి చేయుతతో యాదవ సంఘం మంచిర్యాల జిల్లా అధ్యక్షులు కొమ్ము అశోక్ గారి ఆధ్వర్యంలో భీమిని పోలీస్ స్టేషన్ లో ఈ రోజు హోమియో మాత్రలు ఎస్సై ఏ.కొమురయ్య గారి చేతుల మీదుగా సుమారు 500ల కుటుంబాలకు మరియు భీమిని, కన్నెపల్లి మీడియా మిత్రులకు ఉచితంగా హోమియో మందులు....

ఐఐటి విద్యార్థినికి మంత్రి కేటీఆర్ చేయూత

వరంగల్ జిల్లా హసన్పర్తి కి చెందిన మేకల అంజలికి మంత్రి కే తారకరామారావు ఈరోజు ఆర్థిక సాయం అందించారు. మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో ఐఐటి లో మొదటి సంవత్సరం పూర్తి చేసుకొని రెండవ సంవత్సరంలోకి ప్రవేశించిన అంజలి ఫీజులు ఇతర ఖర్చులు లాప్టాప్ ఖరీదు నిమిత్తం లక్ష 50 వేల రూపాయలను అందించారు. గత ఏడాది హసన్పర్తి లోని గురుకులంలో...

హైదరాబాద్‌లో అందుబాటులోకి మరో పైవంతెన..

హైదరాబాద్‌లో అందుబాటులోకి మరో పైవంతెన.. ప్రారంభించిన మంత్రి కేటీఆర్‌ మహానగరంలో ట్రాఫిక్‌ కష్టాలు తీర్చేందుకు మరో పైవంతెన అందుబాటులోకి వచ్చింది. బైరామల్‌గూడ చౌరస్తా వద్ద పైవంతెనను రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌.....

బ్లాక్ ప‌సుపు విక్ర‌యం.. ఏడుగురు అరెస్టు

ఖ‌మ్మం : మెడిసిన్ త‌యారీలో ఉపయోగించే నిషేధిత అట‌వీ ఉత్ప‌త్తి బ్లాక్ ప‌సుపును విక్ర‌యిస్తున్న ముఠా స‌భ్యుల‌ను పోలీసులు ప‌ట్టుకున్నారు. ఈ ఘ‌ట‌న ఖ‌మ్మంలో చోటుచేసుకుంది. బ్లాక్ ప‌సుపు క్ర‌య విక్ర‌యాలు జ‌రుగుతున్న‌ట్లుగా విశ్వ‌స‌నీయ.....
Like & Share