అవినీతిపై నిఘా:అక్రమ ఇసుక నిల్వలపై దాడులు.SEB అడిషనల్ ఎస్పీ సుమిత్ సునీల్ I.P.S

0
56

దాడుల్లో పాల్గొన్న సిఐ వి. జయ కుమార్ మరియు ఎస్ఐ ఏ బాలాజీ

ఇసుక సామాన్యుడికి అందని ద్రాక్షగా మారింది. అధికారులు అక్రమ ఇసుక దందా లను ఎంత అరికట్టి నప్పటికీ ఎక్కడో ఒక చోట ఏదో ఒక మూల ఇసుకను భారీగా అక్రమ నిల్వలు చేస్తూ వస్తున్నారు. అధికారులు తెలిసేలోపు రాత్రికి రాత్రులు మెరుపు వేగంతో ఇసుకను ఆ ప్రాంతం నుంచి వేరే ప్రదేశానికి చేరవేస్తున్నారు. మరికొందరైతే నేతల పేర్లు చెప్పుకుంటూ ఇసుక దందాలు సాగిస్తున్నారు. స్థానిక పెద్దాపురం పట్టణంలోని సుధా ఆగ్రో ఆయిల్స్ ఫ్యాక్టరీ ఎదురుగా గల ఖాళీ స్థలంలో భారీగా అక్రమ ఇసుక నిల్వలు ఉన్నాయని సమాచారం రావడంతో స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అడిషనల్ ఎస్పీ సుమిత్ సునీల్ I.P.S. మరియు పెద్దాపురం డి.ఎస్.పి అరిటాకుల శ్రీనివాసరావు ల ఆదేశాల మేరకు పెద్దాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ వి. జయ కుమార్ మరియు ఎస్ ఐ ఏ బాలాజీ లు పోలీసు సిబ్బందితో హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని దాడులు జరిపి అక్రమం గా నిల్వ ఉంచిన సుమారుగా 25 యూనిట్ల ఇసుకను సీజ్ చేసి సంబంధిత వ్యక్తులను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి తదుపరి చర్యకై దర్యాప్తు చేస్తున్నట్టు పెద్దాపురం పోలీస్ వారు తెలిపారు.

Like & Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here