Friday, October 23, 2020
Home District ఆగస్ట్ 3న కరోనా వాక్సిన్ రిలీజ్..!ప్రకటన చేసిన రష్యా హెల్త్ మినిస్టర్

ఆగస్ట్ 3న కరోనా వాక్సిన్ రిలీజ్..!ప్రకటన చేసిన రష్యా హెల్త్ మినిస్టర్

ఆగస్ట్ 3న కరోనా వాక్సిన్ రిలీజ్..!

ప్రకటన చేసిన రష్యా హెల్త్ మినిస్టర్

ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా మహమ్మారికి చెక్ పెట్టడానికి.. రష్యా టీకా వచ్చే నెలలో ప్రజలకు అందుబాటులోకి వస్తున్నట్లు ఆ దేశ ఆరోగ్య శాఖ మంత్రి ప్రకటించారు.

ఇందుకు సంబంధించిన పనులు చకచకా జరుగుతు న్నాయని ఆయన తెలిపారు.

ఆగస్టు 3 నుంచి రష్యా, సౌదీ అరేబియా, యునెటైడ్ అరబ్ ఎమిరేట్స్‌లో టీకా మూడో దశ క్లినికల్‌ ట్రయల్స్‌ను వేలాది మందిపై నిర్వహించ నున్నట్టు వెల్లడించారు.

సమాంతరంగా టీకాను కూడా ప్రజలకు అందుబాటు లోకి తెస్తామని చెప్పారు. సెచెనోవ్ విశ్వవిద్యాలయం అభివృద్ధి చేసిన ఈ కరోనా టీకాపై రష్యా అధ్యక్షుడు పుతిన్‌ ప్రధానంగా దృష్టి పెట్టారు.

ఇప్పటికే తొలి రెండు దశల క్లినియల్‌ ట్రయల్స్‌ విజయ వంతంగా పూర్తైనట్లు తెలిపారు.

తొలి వ్యాక్సిన్​..!

అన్ని సక్రమంగా జరిగినట్లయితే… ప్రపంచంలో ప్రజలకు అందుబాటులోకి వచ్చే తొలి కరోనా టీకాగా రష్యా వ్యాక్సిన్‌ నిలవనుంది.

ఈ ఏడాది దేశీయంగా 3 కోట్ల డోస్‌లను ఉత్పత్తి చేయనున్నట్లు రష్యా ప్రకటించింది.

మరో 17 కోట్ల డోస్‌లు విదేశాల్లో తయారవుతాయని తెలిపింది.

వ్యాక్సిన్‌ తయారీకి ఐదు దేశాలు అంగీకారం తెలిపినట్లు రష్యా వెల్లడించింది.

Like & Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

సీజనల్ వ్యాధుల నివారణకు,ఉచితంగా హోమియో మందుల పంపిణీ…

సాయి వైకుంఠ ట్రస్ట్ డా.రవి కిరణ్ గారి చేయుతతో యాదవ సంఘం మంచిర్యాల జిల్లా అధ్యక్షులు కొమ్ము అశోక్ గారి ఆధ్వర్యంలో భీమిని పోలీస్ స్టేషన్ లో ఈ రోజు హోమియో మాత్రలు ఎస్సై ఏ.కొమురయ్య గారి చేతుల మీదుగా సుమారు 500ల కుటుంబాలకు మరియు భీమిని, కన్నెపల్లి మీడియా మిత్రులకు ఉచితంగా హోమియో మందులు....

ఐఐటి విద్యార్థినికి మంత్రి కేటీఆర్ చేయూత

వరంగల్ జిల్లా హసన్పర్తి కి చెందిన మేకల అంజలికి మంత్రి కే తారకరామారావు ఈరోజు ఆర్థిక సాయం అందించారు. మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో ఐఐటి లో మొదటి సంవత్సరం పూర్తి చేసుకొని రెండవ సంవత్సరంలోకి ప్రవేశించిన అంజలి ఫీజులు ఇతర ఖర్చులు లాప్టాప్ ఖరీదు నిమిత్తం లక్ష 50 వేల రూపాయలను అందించారు. గత ఏడాది హసన్పర్తి లోని గురుకులంలో...

హైదరాబాద్‌లో అందుబాటులోకి మరో పైవంతెన..

హైదరాబాద్‌లో అందుబాటులోకి మరో పైవంతెన.. ప్రారంభించిన మంత్రి కేటీఆర్‌ మహానగరంలో ట్రాఫిక్‌ కష్టాలు తీర్చేందుకు మరో పైవంతెన అందుబాటులోకి వచ్చింది. బైరామల్‌గూడ చౌరస్తా వద్ద పైవంతెనను రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌.....

బ్లాక్ ప‌సుపు విక్ర‌యం.. ఏడుగురు అరెస్టు

ఖ‌మ్మం : మెడిసిన్ త‌యారీలో ఉపయోగించే నిషేధిత అట‌వీ ఉత్ప‌త్తి బ్లాక్ ప‌సుపును విక్ర‌యిస్తున్న ముఠా స‌భ్యుల‌ను పోలీసులు ప‌ట్టుకున్నారు. ఈ ఘ‌ట‌న ఖ‌మ్మంలో చోటుచేసుకుంది. బ్లాక్ ప‌సుపు క్ర‌య విక్ర‌యాలు జ‌రుగుతున్న‌ట్లుగా విశ్వ‌స‌నీయ.....
Like & Share