24 తమిళనాడు మద్యం సీసాలు పట్టివేత

0
51

24 తమిళనాడు మద్యం సీసాలు పట్టివేత

ద్విచక్ర వాహనంతో సహా నిందితుడు అరెస్టు

చిత్తూరు జిల్లా సత్యవేడు మండల పరిధిలోని అంబా కం గ్రామ సమీపంలో అక్రమంగా ద్విచక్ర వాహనం ద్వారా తరలిస్తున్న 24 తమిళనాడు మద్యం సీసాలను సత్యవేడు ప్రత్యేక ఎన్ఫోర్స్మెంట్ ఎక్సైజ్ అధికారులు శుక్రవారం స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించి నిందితుడు దాసును ఎక్సైజ్ అధికారులు అదుపులోకి తీసుకోవడం జరిగింది. వివరాలు ఇలా సత్యవేడు ప్రత్యేక ఎన్ఫోర్స్మెంట్ ఎక్సైజ్ ఇన్చార్జి సీఐ మోహన్ ఆదేశాల మేరకు ఎస్ఐ రాజశేఖర్ ఆధ్వర్యంలో అధికారుల బృందం అంబాకం దళితవాడకు సమీపంలో తనిఖీలు చేపట్టారు. ఇందులో భాగంగా ఆ మార్గంలో వచ్చిన హోండా ద్విచక్ర వాహనాన్ని తనిఖీ చేయగా 24 తమిళనాడు మద్యం సీసాలు పట్టు పడ్డాయి. దీంతో ద్విచక్ర వాహనంతో సహా అంబాకం గ్రామానికి చెందిన నిందితుడు దాసును ఎక్సైజ్ అధికారులు అదుపులోకి తీసుకొని కోర్టులో హాజరు పరిచారు. ఈ నేపథ్యంలో సత్యవేడు జ్యుడిషియల్ కోర్టు న్యాయమూర్తి నిందితుడుకి రిమాండ్ విధించినట్లు ఈసందర్భంగా ఎస్ఐ రాజశేఖర్ చెప్పారు. నిందితుడు దాసును పీలేరు సబ్ జైలుకు తరలించినట్టు అధికారులు స్పష్టం చేశారు. ఈ దాడుల్లో ఎక్సైజ్ అధికారులు కార్తీక్, చిరంజీవి తదితరులు పాల్గొన్నారు.

Like & Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here